ఆత్మకూరు(ఎం),జూన్12 : ఎన్నికల ముం దు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర అని ఆయన ఆనవాళ్లను చెరిపేస్తానని విర్రవీగుతున్న సీఎం రేవంత్‌రెడ్డి కాలగర్భం లో కలిసిపోవడం ఖాయమన్నారు. ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన వారికి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాసం పథకంలో భాగంగా నిరుద్యోగ యువతి, యువకులు రాష్ట్ర వ్యాప్తంగా 16లక్షల 28వేల మంది దరఖాస్తులు చేసుకోవడంతో ప్రభుత్వం భయపడిందన్నారు.
జూన్ 2న నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణాలు అందజేసేందుకు మంజూరు పత్రాలు ఇస్తామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాయిదాలు వేస్తూ నిరుద్యోగులను నిరాశపర్చిందన్నారు. బూట కం మాటలతో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, 420 హామీలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దసరా పండుగ లోపు ఇచ్చిన హామీలు నేరవేర్చకుంటే ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి, కొరె భిక్షపతి, పూర్ణచందర్‌రాజు, బీసు ధనలక్ష్మి, మల్లేశంగౌడ్, కొరటికల్ మాజీ సర్పంచ్ కొల సత్తయ్యగౌడ్, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు సోలిపురం అరుణ, యువజన విభాగం మండలాధ్యక్షుడు శంతన్రాజు, బీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు సతీశ్, సైదులు పాల్గొన్నారు.