– యాదగిరిగుట్ట, నవంబర్ 7 ;‘ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డగా మరోసారి మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి. మీ రుణం తీర్చుకుంటా’ అని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రజలను కోరారు. యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వృద్ధులు, మహిళలను పలుకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలోనే యాదగిరి గుట్ట ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. విపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉంటారని చెప్పారు.
యాదగిరిగుట్ట, నవంబర్ 7 : ‘ముఖ్యమంత్రి కేసీఆర్ వదిలిన బిడ్డగా మరోసారి మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి.. రుణం తీర్చుకుంటా’నని ఇంకా ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 వార్డులను కలియతిరిగారు. ఆయా వార్డుల్లో మంగళహరతులిచ్చి, స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న యాదగిరిగుట్టను మున్సిపాలిటీగా మార్చామని గుర్తు చేశారు. ఇప్పటికే రూ.20కోట్లతో పనులు పూర్తయ్యాయని తెలిపారు. అంతర్గతరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇంటిగ్రేటెడ్ మారెట్లు నిర్మిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్, పట్టణ ప్రకృతి వనాలు, పార్కులు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాల పనులు కొనసాగుతుండగా తెలంగాణ క్రీడ ప్రాంణాలను పూర్తి చేశామని గుర్తు చేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి కళ్లకు కట్టినట్టుగా మీకే కనిపిస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఆలయానికి ఒక ఇటుకనైనా మార్చారా అని ప్రశ్నించారు. పులిహోర, దద్దోజనం తిని వెళ్లారే తప్పా కనీసం స్వామివారి ఆలయాన్ని పట్టించుకున్న పాపానపోలేదన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో రూ.1300 కోట్లు నిధులు వెచించి ఆలయాన్ని కృష్ణశిలతో అద్భుతంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇప్పుడు ఇల వైకుంఠపురంగా అలరాడుతుందని చెప్పారు. మంత్రి కేటీఆర్ పట్టణాభివృద్ధికి రూ.25కోట్ల మంజూరు చేశారని, ఇప్పటికే రూ.2కోట్లతో దోబీ ఘాట్ ప్రారంభించుకున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రోడ్డు విస్తరిస్తుంటే కోర్టుల్లో కేసులు వేశారని, పట్టణాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ విష ప్రచారం
కాంగ్రెస్ పార్టీ మానసికంగా దెబ్బతియాలని చూస్తుందని, గిచ్చి పంచాయతీ పెట్టుకుంటున్నదని, విష ప్రచారానికి దిగుతున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ప్రచారానికి వెళ్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వ్యక్తిగతంగా విమర్శిస్తే ఖబర్దార్ సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల్లో ఏం చేస్తారో చెప్పాలి కానీ వ్యక్తిగత దూషణలకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. రోడ్డు విస్తరణ బాదితులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. రోడ్డు విస్తరణలో భాగంగా పాతగుట్ట చౌరస్తా నుంచి వైకుంఠ ద్వారం వరకు, వైకుంఠ ధ్వారం నుంచి గాంధీనగర్, పాత రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద అంజనాద్రి కాలనీలో సుమారు 517 మంది ఇండ్లు, 139 మంది షాపులు కోల్పోయారని, ఒక్కోక్కరికి స్థలానికి స్థలం, షాపుకు షాపు, ఇండ్లు కోల్పోయిన వారికి రూ.89,91,71,656 కోట్ల నష్టపరిహారం అందజేశామని గుర్తు చేశారు. కొండకింద ఉత్తర ప్రాంతంలో లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, నిత్యన్నదానం సత్రం, పార్కింగ్ ప్రాంతంలో షాపింగ్ కాంఫ్లెక్స్ను 139 మంది లబ్ధిదారులకు కేటాయించినట్లు తెలిపారు. ప్రొసిడింగ్ పత్రాలను ఎన్నికలు పూర్తికాగానే అందజేస్తామన్నారు.
డీసీసీబీ చైర్మన్ నిజాయితీగా రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి లాగా అసైన్డ్ భూములకు సర్వే నంబర్లు వేసి దొంగ వ్యాపారం చేయలేదన్నారు. యాదగిరిగుట్ట వాసులు విజ్ఞతతో ఆలోచించి రాబోయే ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీదర్‌గౌడ్, జడ్పీటీసీ తోటకూరి బీరయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కాటంరాజు, కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, ఆవుల మమత, గౌలికారు అరుణ, కో ఆప్షన్ సభ్యులు గోర్ల పద్మ, సయ్యద్ బాబా, రిజ్వానా, బీఆర్ఎస్ నాయకులు ఆరె యాదగిరిగౌడ్, అంకం నర్సింహ, పాపట్ల నరహరి, కవిడె మహేందర్, కోల వెంకటేశ్, చిత్తర్ల బాలయ్య, కీసరి బాలరాజు, ఆరె శ్రీధర్, బీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్, మిట్ట వెంకటయ్య, మఖ్యర్ల ఆండాలు, సతీశ్, స్వాతి, చంద్రం, సత్యనారాయణ, భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.