రాజాపేట, ఏప్రిల్ 18 : వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జాతరలా తరలిరావాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలుపు నిచ్చారు. రాజాపేట మండల కేంద్రంలోని చెల్మిడి ఫంక్షన్హాల్లో శుక్రవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల గుండెలు అదిరేలా సభకు బీఆర్ఎస్ శ్రేణులు తరలిరవాలని కోరారు.
నేడు రాష్ట్రంలో ప్రజా పాలన అని చెప్పుకుంటూ నిర్భంద పాలన కొనసాగిస్తారని మండిపడ్డారు. పాలన చేతకాని కాంగ్రెస్ దద్దమ్మలకు కేసీఆర్‌ను విమర్శించడం తగదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎనలేని అభివృద్ధి జరిగిందిని, తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే రోల్ మోడల్‌గా మాజీ సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని తెలిపారు. ప్రస్తుతం యావత్ తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాడానికి సిద్ధంగా ఉన్నారని, బీఆర్ఎస్ శ్రేణులు సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. రజతోత్సవ సభ చరిత్రలో నిలిచి పోతుందని తెలిపారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, మాజీ జడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు చింతలపూరి వెంకట్రాంరెడ్డి, గుంటి కృష్ణ, గుర్రం నర్సింహులు, మర్ల నాగరాజు, నాయకులు సందిల భాస్కర్‌గౌడ్, ఎర్రగోకుల జశ్వంత్, బెడిదె వీరేశం, కోరుకొప్పల వెంకటేశ్‌గౌడ్, ఠాకూర్ ధర్మేందర్‌సింగ్, డొంకెన మహేందర్ గౌడ్, చెరుకు కనకయ్య, ఠాకూర్ భగత్‌సింగ్, కొమ్ము పాండు, చెన్న నర్సింహారావు, ఉప్పలయ్య గౌడ్, ఎస్కే కరీం, లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.
రాష్ర్టానికి బీఆర్ఎస్ పార్టే శ్రీరామరక్షగా నిలుస్తుంది. పదేండ్ల పాలనలో కేసీఆర్ అందరికీ అండగా నిలిచారు. అలాంటి నాయకత్వం లేక ప్రజలు నేడు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల మాయ మాటలలు నమ్మి ప్రజలు మోసపోయారని, నేడు అన్ని విధాలుగా గోసపడుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకుల దండుగా కదలి రావాలి.
-బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ శ్రేణులు ఉప్పెనలా తరలిరావాలి. గ్రామాల్లో నాయకులే కథానాయకులై సభకు కదలాలి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకలు కేసుల పేరిట గొంతు నొక్కుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం అవలబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాం చేస్తూనే ఉంటాం. రాష్ట్ర ప్రజలాంతా కేసీఆర్ వెన్నెంటే ఉన్నారు.
-కల్లూరి రాంచంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 18 : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలో అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభపై శుక్రవారం భూదాన్ పోచంపల్లిలోని జీబీఆర్ గార్డెన్లో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో జీవించారని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు అమలు కానీ హామీలతో గద్దెనెకిన కాంగ్రెస్ సరార్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించుకుని పార్టీ సత్తా చాటాలని, గ్రామాల్లో పార్టీ బలం బలంగా మారాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి రజతోత్సవ సభ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలకు ఉత్తేజాన్ని నింపాలని సూచించారు. రజతోత్సవ సభకు గ్రామ గ్రామాన దండులా కదలి రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కోట మల్లారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు, సీత వెంకటేశ్, గునిగంటి మల్లేశ్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు చిలువేరు బాల నరసింహ, బండారు లక్ష్మణ్ గౌడ్, నాయకులు చక్రపాణి, బలరాం, పగిల రామ్ రెడ్డి, బత్తుల శ్రీశైలం, నోముల మాధవరెడ్డి, చేరాల నరసింహ, సీత శ్రవణ్, చింతకింది కిరణ్, వేముల సుమన్, జింకల యాదగిరి, కర్నాటి అంజమ్మ పాల్గొన్నారు.