ఆత్మకూరు(ఎం), జనవరి 3 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి గోదావరి జలాలు జిల్లాకు అందుతున్నాయి. తాజాగా ఆత్మకూరు(ఎం)లోని వీర్ల చెరువుకు నీళ్లు రావడంతో శుక్రవారం రైతులు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి చెరువు వద్ద కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో రూ.కోటీ 30లక్షలతో మిషన్ కాకతీయలో చెరువు పునరద్ధరణ చేపట్టినట్లు తెలిపారు.
మండలంలోని బిక్కేరువాగులపై మోదుగుబావిగూడెం, టి.రేపాక, పారుపల్లి, కామునిగూడెం, కొరటికల్ గ్రామాల్లో చెక్‌డ్యామ్‌లు నిర్మించిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి, కొరె బిక్షపతి, మాజీ ఎంపీటీసీ యాస కవిత, బీసు ధనలక్ష్మీ, సోలిపురం అరుణ, నాతిరాజు, అజీమ్మొద్దీన్, అబ్బసాయిలు, విజయ్, వెంకన్న, రాంబాబు, స్వామి, సత్తయ్య, ఉపేందర్‌రెడ్డి, లింగయ్య, ఉప్పలయ్య రైతులు పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని కూనూరు గ్రామ చెరువు కాళేశ్వరం జలాల ద్వారా జలకళను సంతరించుకుని అలుగు పోస్తుండగా, శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు చెరువు వద్ద సంబురాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో రైతును రాజును చేయాలన్న సంకల్పంతో పని చేసిన ముఖ్యమత్రి కేసీఆర్ అని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశా ఖ అధ్యక్షుడు పాశం మహేశ్, మాజీ సర్పంచ్‌లు అంకర్ల మురళీకృష్ణ, డోకె బాలకృష్ణణ్, నాయకులు వడి కర్ణాకర్, శ్రీనివాస్, చందర్రావు, బుగ్గ శంకర్, గుండ్ల రాములు, వడి మహేశ్, వడ్లకొండ పాండు, రైతులు దొమ్మాటి రాములు, రాంచందర్, రాములు, బుగ్గ రాములు, బుగ్గ బలరాం పాల్గొన్నారు.