కోదాడ, ఆగస్టు 23 : కోదాడ మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డు లక్ష్మీపురంలో రూ.3 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పనుల జాతరతో నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ కార్య క్రమంలో నాయకులు రావెళ్ల కృష్ణారావు, లైటింగ్ ప్రసాద్, మేకపోతుల సత్యనారాయణ, ముస్తఫా, నిజాం, కృష్ణబాబు, వీరబాబు, జానీ, పగ్గిళ్ల వెంకన్న, రఫీ, లక్ష్మి, బొబ్బమ్మ, పున్నమ్మ, అపరాజ్యం పాల్గొన్నారు.