భగీరథ్‌ను కాపాడేందుకు సీఎం యత్నం.. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల
బండి సంజయ్ కొడుకును కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని, అందుకే బండి నిత్యం కాంగ్రెస్‌కు వత్తాసు పలుకుతున్నాడన్నారు.
చౌటుప్పల్, మే 12 : బండి సంజయ్ కొడుకును కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని, అందుకే బండి నిత్యం కాంగ్రెస్‌కు వత్తాసు పలుకుతున్నాడన్నారు. తక్షణమే బండి కొడుకును ఎన్కౌంటర్ చేయాలన్నారు. పెద్దోడికో న్యాయం..పేదోడికో న్యాయమా అని ప్రశ్నించారు. మంగళవారం చౌటుప్పల్‌లోని హైవేపై బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ పోక్సో కేసు నమోదైన సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి, మంత్రి పదవి నుంచి బండిని బర్తరఫ్ చేయాలన్నారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు చేసి మూడు నెలలు గడస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్ల్లోర్ లీడర్ కొయ్యడ శేఖర్ గౌడ్, మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, నాయకులు తాడూరి పరమేశ్, ఊడుగు మల్లేశం గౌడ్, ఢిల్లీ మాధవరెడ్డి, చిన్నం బాలరాజు, గడ్డం రాజరత్నం, తొర్పునూరి మల్లేశం గౌడ్, అతహర్ పాషా, వల్లందాసు సతీశ్ గౌడ్, సుర్కంటి రాంరెడ్డి, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

