త్రిపురారం, జూలై 07 : త్రిపురారం మండలంలోని మాటూరు గ్రామానికి చెందిన కళాకారుడు కలకొండ శ్రీనివాస్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సోమవారం శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం దుగ్గేపల్లి గ్రామానికి చెందిన కందుల రమేశ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కొనకంచి సత్యనారాయణ కంటి ఆపరేషన్ చేయించుకుని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన నివాసానికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పామోజు వెంకటాచారి, మాజీ మార్కెట్ ఛైర్మన్ కామర్ల జానయ్య, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ గుండెబోయిన వెంకన్న, బైరం కృష్ణ, అనుముల శ్యామ్సుందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ మజ్జిగపు వెంకట్రెడ్డి, జంగిలి శ్రీను, పొలగాని నరసింహాగౌడ్, చింతకాయల యాదయ్య, వెంకటయ్య, మడుపు వెంకటేశ్వర్లు, ధనావత్ రవి, కొండలు, రామలింగయ్య, సందీప్, గోపి, ఇసాక్ పాల్గొన్నారు.