నీలగిరి, జూలై19: నకిరేకల్ నియోజకవర్గంలో శాంతిభద్రతలు గాడితప్పాయని మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శనివా రం నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్‌ను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాలను ఆయనకు వివరించారు. అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడుతూ గత ఐదేం డ్లు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో కొంతమంది కావాలనే అలజడులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులను టార్గె ట్ చేసి గ్రామాల్లో కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇందిరమ్మ ఇం టిని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌కు కేటాయించడాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించిన నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త మనోహర్‌రెడ్డిపై మాజీ సర్పంచ్, అతడి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. దీనిపై మనోహర్ రెడ్డి నకిరేకల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా వేరే ఫిర్యాదు పేరిట కేసు నమోదు చేస్తామని బెదిరించారన్నారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. కడపర్తిలో గొర్ల భిక్షమయ్య అనే రైతుకు చెందిన భూమి వివాదం లో ఉన్నదని, ప్రత్యర్థి ఎమ్మెల్యే, గన్‌మెన్ కావడంతో పోలీసులు సంవత్సరం నుంచి పట్టించుకోవడం లేదన్నారు. మండలాపురంలో ఏర్పు ల నాగమ్మ, వల్లభాపురంలో మాద రమేశ్, కడపర్తిలో గొర్ల మహేశ్ సమస్యలు నెలల తరబడి పోలీస్ స్టేషన్లో మగ్గుతున్నాయని ఆయన ఆరోపించారు. వీటిపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ చూపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.