కోదాడ, మే 21 : బీఆర్ఎస్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామరావును గురువారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల ఆయన నివాసంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత, త్వరలో జరగనున్న సభ్యత్వ నమోదు తదితర అంశాలపై బొల్లం మల్లయ్య యాదవ్ చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ట నిర్మాణానికి కృషి చేయాలని కేటీఆర్ సూచించారు.