కోదాడ, మే 04 : కోదాడలో ఈ నెల 7న గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ శ్రేణుల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం నియోజకవర్గంలోని మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత పలు ఐకెపి సెంటర్లను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం కోదాడలో నిర్వహించనున్న సమావేశానికి హాజరై దిశా నిర్దేశం చేయనున్నట్లు బొల్లం మల్లయ్య యాదవ్ వెల్లడించారు. కావునా ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.