వచ్చేది మన ప్రభుత్వమే
బీఆర్ఎస్ పార్టీ శ్రేణు లు అధైర్య పడొద్దని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందు కు వెళ్తున్న ఆయనకు వంగపల్లిలో బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుకు లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదం అందజేసి, శెల్లాతో సన్మానించారు.
- మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి24: బీఆర్ఎస్ పార్టీ శ్రేణు లు అధైర్య పడొద్దని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం వరంగల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందు కు వెళ్తున్న ఆయనకు వంగపల్లిలో బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుకు లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదం అందజేసి, శెల్లాతో సన్మానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని భయపడాల్సిన పనిలేదన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను మరిచి, కక్ష సా ధింపు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు ముక్యర్ల సతీశ్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ రేపాక స్వామి, మాజీ ఎంపీటీసీ రేపాక మౌనిక, మాజీ సర్పంచులు తోటకూరి బీరయ్య, ఆరె మల్లేశ్, నాయకులు కోల వెంకటేశ్‌గౌడ్, గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, బొట్టు రాజు, బీమగాని నర్సింహా, సీస రమేశ్, శారాజీ రాజేశ్, సతీశ్ భట్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

