దేవరకొండ రూరల్, జూలై 14 : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 13 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులను చికిత్స కోసం సోమవారం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం విద్యార్థినిలకు స్నాక్స్ గా బొబ్బెర్లు, రాత్రి చికెన్‌తో కూడిన భోజనం అందించారు. కొద్దిసేపటి తర్వాత పలువురు విద్యార్థినులు వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆశ్రమ పాఠశాల ఏఎన్ఎం పాఠశాలలోనే ప్రాథమిక చికిత్స చేయడం జరిగింది. సోమవారం ఉదయం పులిహోర తిన్న తర్వాత విద్యార్థినిలకు మళ్లీ వాంతులు, విరోచనాలు కావడంతో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Devarakonda Rural : ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 13 మందికి అస్వస్థత