Nalgonda | నల్లగొండ నియోజకవర్గంలో సాగు నీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
Nalgonda | సాగునీటి కోసం( Irrigation water) నల్లగొండ నియోజకవర్గంలో రైతులు ఆందోళన బాట పట్టారు.
నల్లగొండ : సాగునీటి కోసం( Irrigation water) నల్లగొండ నియోజకవర్గంలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఉదయ సముద్రం ఎస్ఎల్బీసీ కింద ఉన్న మామిడాల, పజ్జుర్, ఇండ్లుర్, గోరెంకల పల్లి, మండలాపురం గ్రామాల్లో గత 20 రోజులుగా సాగు నీరు అందక పొట్టదశలో ఉన్న పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ధర్నా చేపట్టారు. ఎస్ఎల్బీసీ కింద ,D 40, L.11 తూముల ద్వారా తమకు సాగు నీళ్లు వచ్చేవని, కానీ ఇరిగేషన్ అధికారులు తమకు నీళ్లు ఇవ్వకుండా తూములకు సీల్ వేసి వేరే ప్రాంతానికి నీళ్లు తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మమీడాల గ్రామంలోని L 11 తూము వద్ద 6 గ్రామాల రైతులు ధర్నాకు చేపట్టారు. తూముల సీల్ తొలగించి తమ పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని వారు వేడుకున్నారు. ఇరిగేషన్ అధికారులు వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి రైతులను వేదింపులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నా తమకు ఒరిగింది శూన్యం అని రైతులు మండిపడ్డారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dubai ETCA | దుబాయ్లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

