మునుగోడు, సెప్టెంబర్ 01 ; యూరియా కోసం అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. మునుగోడు మండల వ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో యూరియా అవసరం పెరిగింది. యూరియా కొరతతో రైతన్నలు పస్తులుండి క్యూలైన్ లో ఉన్న దొరకని పరిస్థితి ఏర్పడ్డది. మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతలు సోమవారం ఉదయం నుండే సొసైటీ వద్దకు చేరుకుని క్యూ కట్టారు. 222 బస్తాల యూరియా సొసైటీకి వచ్చింది. వివిధ గ్రామాల నుండి రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీస్ పహారా నడుమ రైతుకు కేవలం ఒక బస్తా మాత్రమే పంపిణీ చేశారు.
తమకు సరిపడ యూరియాను అందించడం లేదని రైతులు వాపోయారు. మునుగోడుకు ప్రస్తుతం 150 టన్నుల యూరియా వస్తేగానీ సరిపోని పరిస్థితి నెలకొంది. ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ వెంటనే యూరియా కొరత తీర్చాలని ప్రభుత్వానికి రైతలు మొరపెట్టుకొంటున్నారు. సొసైటీ వద్ద పరిస్థితిని ఏఓ పద్మజ పరిశీలించారు. ఎవరు ఆందోళన చెందొద్దని రైతులందరికీ సరిపడా యూరియా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.