చందంపేట (దేవరకొండ), సెప్టెంబర్ 11 : దేవరకొండ వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా వచ్చిందని తెలిసిన రైతులు గురువారం సహకార సంఘం, దేవరకొండ వ్యవసాయ కార్యాలయం వద్దకు ఒక్కసారిగా చేరుకున్నారు. యూరియా కోసం లైన్లో నిలబడ్డారు. కాగా యూరియా లేదని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన దిగారు. దేవరకొండ వ్యవసాయ కార్యాలయానికి 400 బస్తాలు యూరియా వచ్చిందని, పంపిణీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ సందర్భంగా పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.