‘కౌలు రైతులకు రైతు భరోసా అందించాలి’
కౌలు రైతులకు రైతు భరోసా పథకం ద్వారా తక్షణమే నిధులు విడుదల చేయాలని కౌలు రైతు సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండమీది వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చండూరు పట్టణ కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పి..
– కౌలు రైతుల సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండమీది వెంకన్న డిమాండ్
చండూరు, జూన్ 30 : కౌలు రైతులకు రైతు భరోసా పథకం ద్వారా తక్షణమే నిధులు విడుదల చేయాలని కౌలు రైతు సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండమీది వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చండూరు పట్టణ కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పి వారికి రైతు భరోసా ద్వారా ఎకరం రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి నేడు వారిని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు వ్యవసాయానికి పెట్టుబడి పెట్టి, కౌలు డబ్బులు చెల్లించి తీవ్రం ఇబ్బందులు పడుతున్నారని, అలాగే స్లాట్ యూరియా విధానం వల్ల నిరక్షరాసులైన రైతులు స్మార్ట్ ఫోన్ లేక ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుందన్నారు. ఎకరం రైతులు ఒక్క బ్యాగ్కు 10 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లి బస్తా తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. యూరియ స్లాట్ విధానంను రద్దుచేసి యూరియాను అన్ని దుకాణాలలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

