చందంపేట, సెప్టెంబర్ 24 : చందంపేట మండలంలోని పోలేపల్లి గేటు వద్ద ఆగ్రోస్ కంపెనీ వారి ఆధ్వర్యంలో బుధవారం యూరియా రావడంతో రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు లైన్లో నిలబడ్డారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేశారు. గత మూడు రోజుల క్రితం ఒక్కో రైతు ఆధార్ కార్డు నమోదు చేసుకుని 2 బస్తాల చొప్పున పంపిణీ చేశారు. కొంతమంది రైతులకు యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. 200 బస్తాల యూరియాను పంపిణీ చేసినట్లు వ్యవసాయ అధికారి లక్పతి తెలిపారు.