– ఏడుగురు అధికారులకు గాయాలు
– చందంపేట మండలం గువ్వలగుట్టలో ఘటన
చందంపేట, నవంబర్ 12 : అటవీ శాఖ అధికారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చందంపేట మండలం గువ్వలగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా బీట్ ఆఫీసర్లతో ఎఫ్బీఓ సంగీత, ఎఫ్ఆర్ఓ సుమన్ చందంపేట మండలంలో పర్యటిస్తుండగా గువ్వలగుట్ట వద్ద అటవీ భూములను దున్నుతున్న వద్దకు వెళ్లి అటవీ భూములను దున్నవద్దని చెప్పారు. కాగా ఇవి తమ భూములేనని తాము దున్నుతామని రైతులు తెలుపగా పట్టాలు చూపించాల్సిందిగా అటవీ శాఖ అధికారులు అడిగారు. దీంతో రైతులు, అటవీ అధికారులకు మధ్య వాగ్వాదం పెరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లోకేశ్ తెలిపారు.