గుండాల, ఫిబ్రవరి 20: ఎన్నికలు రాగానే ప్రభుత్వానికి రైతు భరోసా గుర్తుకొస్తుందని, రైతు భరోసాను ఓట్ల భరోసాగా మార్చి ఓట్లు రాబట్టుకునేందుకే ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వకుండా రైతులను మో సం చేస్తోందన్నారు.
వరి నా ట్లు వేసి రెండు నెలలు కావొస్తున్నా నేటికీ రైతుభరోసా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మదర్ డైయిరీని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే బీర్ల అయిల య్య గొప్పలు చెప్పారు. అతని అనుచరుడు మధుసూదన్‌రెడ్డిని చైర్మన్ చేసిన తర్వాత రూ.30 కోట్ల గ్రాంట్ తెస్తాననీ చెప్పారు. రూ.4 బోనస్ ఇస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు.
పాడి రైతులకు సంబంధించిన 8 పాల బిల్లులు పెండింగులో ఉన్నాయి. 9వ బిల్లు కూడా చెల్లించే సమయం వచ్చింది. మదర్ డెయిరీ విషయంలో ఎమ్మెల్యే బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షు డు ఎండీ ఖలీల్, నాయకులు మహేశ్వరం మహేందర్‌రెడ్డి, కురిమిళ్ల శ్రీను, కూనగళ్ల గణేశ్, కోలుకొం డ రాములు, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌దాస్ వెంకన్న, పూర్ణచందర్, పరశురాములు, కొమ్మగళ్ల దయాకర్, కాసం నగేశ్, పొన్నగాని మహేశ్, సాయి, నాగరా జు, ప్రశాంత్, పాండు, మచ్చగిరి ఉన్నారు.