చిట్యాల, ఫిబ్రవరి 21 : సాగునీటి వసతి లేక, భూగర్భ జలం జాడ లేక చేతికి వచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయి. చిట్యాల మండలంలో రైతులు 13,600 ఎకరాల్లో వరి సాగు చేయగా, 15శాతానికి పైగా ఎండిపోయినట్లు అధికారిక లెక్కలే చెప్తున్నాయి.
చిట్యాల, చిన్నకాపర్తి, పెద్దకాపర్తి, వనిపాకల, వట్టిమర్తి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పొట్టకొచ్చిన దశలో నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. పెద్దకాపర్తికి చెందిన రైతు ఈరటి వెంకన్న పదెకరాల్లో వరి వేయగా, రెండెకరాలకుపైగా ఎండిపోయింది. మిగిలిన పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లో నీళ్లు తెచ్చి పొలానికి పెడుతున్నాడు.