చందంపేట, అక్టోబర్ 17 : చందంపేట మండలం గన్నేర్లపల్లి గ్రామం ధర్మతండాలో కొలువైన ముత్యాలమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జలా నర్సింహారెడ్డి, వెంకటయ్య, ఆర్కే రెడ్డి, మల్లారెడ్డి, బాధ్య నాయక్, గోవింద్ యాదవ్, సాదిక్, గిరి, హరికృష్ణ, రమేశ్ పాల్గొన్నారు.