త్రిపురారం, జూన్ 11 : నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత, కేజీబీవీ, మోడల్ స్కూళ్లకు ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన 1 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను ఎంపీడీఓ కునిరెడ్డి విజయకుమారి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంను సద్వినియోగం చేసుకుని విద్యార్ధులు కష్టపడి చదవి ఉన్నత స్థాయికి ఎదిగి మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్ధుల హాజరు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రమావత్ రవి, ఏపీఎం అశోక్, ప్రధానోపాధ్యాయులు వాసు, నాయకులు బిట్టు రవికుమార్, అనిల్ పాల్గొన్నారు.