ఆత్మకూర్.ఎస్, జూలై 12 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో పలువురు చేరుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆత్మకూర్.ఎస్ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాచకొండ శ్రీరాములు, రాచకొండ ఉప్పలయ్య, రాచకొండ నగేశ్, సైదులు, సతీశ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో బుధవారం చేరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మారగాని కన్నయ్య, మాజీ ఎంపీటీసీ కన్నోజు వెంకటేశ్వర్లు, బాదావత్ వెంకన్న, ప్రశాంత్, పన్నాల వెంకట్‌రెడ్డి, ఎల్లంకొండ మల్లారెడ్డి, రాస వెంకట్‌రెడ్డి, మెట్టు మల్లారెడ్డి పాల్గొన్నారు.
యాదవుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
సూర్యాపేట రూరల్ : రాష్ట్రంలో యాదవుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని టేకుమట్ల గ్రామంలో 18మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో మాంసం దిగుమతి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదగబోతుందని అన్నారు. గొర్ల కాపరుల కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. గొర్రెల కాపరులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి.భిక్షం, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి శ్రీనివాస్‌రావు, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ పిండిగ పద్మ, నాయకులు కంచర్ల శ్రీధర్‌రెడ్డి, మల్లెబోయిన శ్రీను, పిండిగ నాగేందర్, రుక్మారావు, వెంకటయ్య, రాంబాబు పాల్గొన్నారు.