కట్టంగూర్, మార్చి 19 : విద్యార్థులు లక్ష్యం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కట్టంగూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 70 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, స్కేళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.
పదో తరగతి ఫలితాల్లో మండల ప్రథమ, ద్వితీయ ర్యాంకులు పొందిన విద్యార్థులకు నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ఊట్కూరు ఏడుకొండలు, మాజీ సర్పంచ్ ముప్పిడి యాదయ్య, నాయకులు చిట్యాల రాజిరెడ్డి, మేకల రమేశ్, తండు సోములు, నిమ్మనగోటి శివ, ఊటుకూరు నాగయ్య, ఉపాధ్యాయులు మహాలక్ష్మి, అంథోని, సునంద, విఠల్ కుమార్, గపూర్ పాల్గొన్నారు.