– ఉల్లంగించిన కళాశాలపై చర్యలు
– డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రిన్సిపాల్స్ సమావేశంలో ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
రామగిరి, ఏప్రిల్ 15 : యూనివర్సిటీ ఉన్నత విద్యా మండలి మేరకు డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు జరపాలని, నిబంధనలు అతిక్రమించిన కళాశాలలపై చర్యలు ఉంటాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూనివర్సిటీ పరిధిలో నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న యూజీబీజీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో బుధవారం యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిగ్రీ కళాశాలలో నిబంధనల ప్రకారం నిర్వహించాలని, దోస్త్ నియమాల ప్రకారం 25 శాతం కన్నా కోర్సుల్లో విద్యార్థులు తక్కువ ఉంటే కోర్సు రద్దు పరిచి వారిని వేరే గ్రూప్లో కానీ వేరే కళాశాలకు కానీ పంపివేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కళాశాలలోని అడ్మిషన్ ప్రక్రియ విద్యార్థుల సంఖ్యను ఒక్కొక్కటిగా చర్చించి తగు సూచనలు చేశారు. కోర్సుల నిర్వహణకు నాణ్యమైన విద్యను అందించి మెరుగైన మానవ వనరులను అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ డా. వై ప్రశాంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆడిట్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ డా.ఎం. జయంతి, కో ఆర్డినేటర్ సమరీన్ ఖాజ్మీ, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.