కట్టంగూర్, నవంబర్ 24 : తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో అన్న తెగువతో నాలుగు కోట్ల ప్రజలను ఏకం చేసి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజకీయ వ్యవస్థలను ఏకం చేసిన దీక్షా దివస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తే జైత్ర యాత్ర లేకుంటే తన శవయాత్ర అని నిమ్స్ నుండే ప్రకటించిన గొప్ప ఉద్యమ నేత కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం మెడలు వంచి స్వరాష్ట్ర లక్ష్యం నేరవేర్చిన ఆయన సంకల్ప దీక్ష చరిత్రలో చిరస్థాయికి నిలిచిపోయిందన్నారు. నకిరేకల్‌లో 100 వడకల ఆస్పత్రి, అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్, సెంట్రల్ లైటింగ్, డివైడర్స్ తో పాటు ప్రధాన కూడళ్ల వద్ద ఆయా మండలాల పార్టీ శ్రేణులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 29న దీక్షా దివస్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, నాయకులు వడ్డె సైదిరెడ్డి, పెద్ది బాలనర్సయ్యగౌడ్, బీరెల్లి ప్రసాద్, గుండగోని రాములు, తవిడబోయిన భవాని, దాసరి సంజయ్ కుమార్, వనస సైదులు, బెల్లి సుధాకర్, నలమాద సైదులు, వడ్డె సైదిరెడ్డి, అంతటి శ్రీను, వనం దుర్గయ్య, రాచకొండ యాదయ్య, పోగుల నర్సింహ్మ, దేవరకొండ నరేశ్, కన్నయ్య, అంజయ్య పాల్గొన్నారు.

Kattangur : చరిత్రలో చిరస్థాయికి నిలిచిన దీక్షా దివస్ : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య