MLA Jagadish Reddy | నాగారం : సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. నాగారం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత సంఘల నాయకులు మాట్లాడుతూ.. మా నాగారం గ్రామంలో అంటరానితనాన్ని తుడిచివేసిన మొదటి వ్యక్తి జగదీష్ రెడ్డి అని పేర్కొన్నారు. రైతుల గురించి, ప్రజల పక్షాన శాసనసభలో తన గొంతు బలంగా వినిపిస్తున్నందున అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాగారం గ్రామంలో మాలో ఒకడిగా ఉంటూ కుల మతాలకతీతంగా అమితమైన ప్రేమ చూపిస్తూ, దళితుల కోసం పాటు పడే వ్యక్తిగా గుర్తింపు ఉన్న వ్యక్తి జగదీష్ రెడ్డి అని పేర్కొన్నారు. ఏ సమయాన ఏ ఆపద ఉన్న మా దళితుల కోసం పాటు పడే వ్యక్తి జగదీష్ రెడ్డి అని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం పాటుపడుతున్న జగదీశ్ రెడ్డిని.. దళితులను అవమానించాడని వక్రీకరించి అసెంబ్లీ సెషన్స్ నుండి సస్పెన్షన్ చేయడమనేది కాంగ్రెస్ పార్టీది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నామని నాగారం మండల కేంద్రానికి చెందిన దళిత సంఘాల నేతలు మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో నాగారం మాజీ ఎంపీపీ కూరంమణి వెంకన్న, మండల నాయకులు చిప్పలపల్లి సోమయ్య, చిప్పలపల్లి రాములు, చిప్పలపల్లి చిరంజీవి, చిప్పలపల్లి మల్లేష్, దేవరకొండ మురళి, పాల్వాయి మల్లయ్య, చిప్పలపల్లి ఎల్లయ్య, మల్లెపాక సోమయ్య, బాలస్వామి, చిప్పలపల్లి బాబు, పరుశరాములు, నారాయణ, శ్రీను, నాగరాజు, పండు తదితరులు పాల్గొన్నారు.