యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్(నార్ముల్) పాడి రైతులకు అం డగా నిలుస్తూ వస్తున్నది. దీని పరిధిలో 24 పాలశీతకీకరణ కేంద్రాలు ఉన్నాయి. 435 పాల సొసైటీల్లో 32వేల మంది వరకు సభ్యులు ఉనన్నారు. ప్రతి రోజూ సుమారు 50 నుంచి 60 వేల లీటర్ల వరకు పాలు విక్రయిస్తునన్నారు. పాలు, అనుబంధ ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇందులో ప్రధానంగా నెయ్యి ఉన్నది.
ఈ ఏడాది మార్చి వరకు యాదగిరిగుట్ట, చెర్వుగట్టు, కీసర, వేములకొండ తదితర ఆలయాలకు విజయ డెయిరీ నెయ్యి మాత్ర మే వాడాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే ఆయా దేవస్థానాలకు సరఫరా చేస్తున్న నార్ముల్కు భారీ దెబ్బ పడింది. అప్పటి ఈవో భాసర్రావు విజ్ఞప్తి మేరకు యాదగిరిగుట్టకు మాత్రం మినహాంపు ఇచ్చారు. సెప్టెంబర్లో మదర్ డెయిరీ నెయ్యి సరఫరా నిలిపోయింది. దీంతో విజ య డెయిరీకి మార్గం సులభం కావడంతో సెప్టెంబర్ 24 నుంచి అదే ప్రభుత్వ డెయిరీ నుంచి నెయ్యి సరఫరా చేస్తున్నారు. గతంలో మాదిరిగానే కిలో నెయ్యికి జీఎస్టీతో కలిపి రూ.609 ధర నిర్ణయించారు. ప్రస్తుతం దేవస్థానానికి 140 క్యాన్లు వచ్చాయి. ఒక క్యాన్ లో 35 కేజీల నెయ్యి ఉంటుంది. దీంతో యాదగిరిగుట్టకు, నార్ముల్కు మధ్య ఉన్న నాలుగు దశాబ్దాల బంధానికి తెరపడింది.
మదర్ డెయిరీకి యాదగిరిగుట్ట ప్రధాన ఆదాయ వనరు. డెయిరీ నుంచి ఒక యాదగిరిగుట్ట దేవస్థానానికి ప్రతినెలా 30 టన్నుల నెయ్యి సరఫరా అయ్యేది. దీని ద్వారా ఏటా రూ.18 కోట్ల వరకు దేవస్థానం చెల్లిస్తున్నది. ఇప్పుడు పెద్ద మొత్తంలో చెల్లింపులు నిలిచిపోనుండటంతో నార్ముల్కు మరింత నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే సంస్థ భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నది. రైతులకు 7 పాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగులకు ఒకనెల జీతం పెండింగ్లో ఉంది. ఇలా నే కొనసాగితే నార్ముల్ డెయిరీ మూసివేతే దికవుతుందని ఆ సంస్థ సభ్యులే చెప్పుకొస్తున్నారు.
పాడి రైతులకు మేలు చేస్తున్న డెయిరీని కాపాడటంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. సంస్థను ఆదుకుంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం రూ.20 కోట్ల ఆర్థిక సాయం చేస్తే డెయిరీకి ఆర్థికంగా ఉపశమనం లభిస్తుంది. ఆ దిశగా ఎప్పుడూ అడుగు ముందుకు వేయలేదు. కనీసం రూ.20 కోట్లు తెప్పించలేని దుస్థితిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. డెయిరీ అధిక శాతం మంది పాడి రైతులు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వారే. ఇందులో ఆలేరు నియోజకవర్గంలో అగ్రభాగం. యాదగిరిగుట్ట ఆలయానికి నెయ్యి సరఫరా నిలిపివేయకుండా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి