చండూరు, ఏప్రిల్ 10 : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో గ్యాస్ బండతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు2024 నుంచి తగ్గాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్ పై రూ.50 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరలను తగ్గించేవరకు ఆందోళన నిర్వహిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మోగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య, కే, నరసింహ, గౌసియా బేగం, బల్లెం స్వామి, ఈరటి వెంకటయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నల్లగంటి లింగస్వామి, అలివేలు, చంద్రమ్మ, రవమ్మ, రమేష్, ఇర్గి యాదయ్య, గండూరి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.