మిర్యాలగూడటౌన్, నవంబర్ 23 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం మొత్తం ఉండేలా మోదీ కుట్ర చేస్తున్నారని, అరాచకపాలన సాగిస్తున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. మిర్యాలగూడ పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆ పార్టీ నియోజకవర్గ జనరల్‌బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సమీపించే కొద్ది ఈడీ, ఐటీ దాడులంటూ ఇతర ప్రభుత్వాల మంత్రుల ఇండ్లపై దాడులు చేయించడం బీజేపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని అన్నారు. ఈనెల 27న నల్లగొండలో రైతు సంఘం భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్ని గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేశ్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరెపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్ పాల్గొన్నారు.