మునుగోడు, ఏప్రిల్ 09 : కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌పై రూ.50, డీజిల్, పెట్రోల్‌పై రూ.2 పెంచడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో బుధవారం సీపీఐ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు సురిగి చలపతి, మండల కార్యదర్శి చాపల శ్రీను మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గుళ్లు, దేవుళ్ల పేరా మతోన్మాదాన్ని పెంచిపోషిస్తుందన్నారు. ఇప్పటికే జీవన వ్యయం భారమైందంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ విధంగా కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తుందన్నారు.
కార్పోరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ, ఉన్నత వర్గాలకు కొమ్ముకాస్తూ, సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్రం విధానాలను తిప్పి కొట్టాలని కార్మికులను, పార్టీ శ్రేణులను వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎం.పాండు, మండల కార్యవర్గ సభ్యుడు దుబ్బ వెంకన్న, పట్టణ కార్యదర్శి కురుమర్తి ముత్తయ్య, బండారు శంకర్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి బెల్లం శివయ్య, బీసీ సంఘం మండల అధ్యక్షుడు ఈదులకంటి కైలాస్, మండల కార్యవర్గ సభ్యుడు కాగిత వెంకన్న, కొంపల్లి.రాములు, కాసీం, చందపాక యాదయ్య, శిరగోని మారయ్య, మందుల వెంకన్న, ప్రేమలత, అండాలు, బక్కమ్మ, పూల రాములమ్మ, దుబ్బ ప్రమోద్, పాలకూరి యాదయ్య పాల్గొన్నారు.