కోదాడ, మే 08 : ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్య సామన్యమైనదని, త్రివిధ దళాల సాహసాలకు భారత్ గర్విస్తుందని రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి, కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం కోదాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్లో, పాక్ ఆక్రమిత కశ్మీర్లో మిలిటెంట్లకు చెందిన తొమ్మిది స్థావరాలపై చేసిన దాడులు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రేరేపిత తీవ్రవాదాన్ని తుదముట్టించే ప్రక్రియలో త్రివిధ దళాలు చూపిన ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తుందన్నారు. ఫైటర్ పైలట్‌గా తన అనుభవాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. త్రివిధ దళాలు సమర్ధవంతంగా, ఎంతో చాకచక్యంగా శత్రు శిబిరాలపై దాడులు జరిపి పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం నేర్పారని మంత్రి పేర్కొన్నారు.