కొండమల్లేపల్లి, అక్టోబర్ 24 : దళారులకు పత్తిని అమ్మి రైతులు మోసపోవద్దని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని చిల్కమర్రి స్టేజి శివ గణేష్ కాటన్ మిల్లు వద్ద సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తేమ తక్కువ ఉండి, చెత్తాచెదారం లేని నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.8,110 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ నాయిని జమున మాధవరెడ్డి, వైస్ చైర్మన్ తగుళ్ల సర్వయ్య, పిఎసిఎస్ చైర్మన్ దుదిపాల వేణుధర్ రెడ్డి, పీఏపల్లి మండలాధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్, మార్కెట్ డైరెక్టర్ సుధాకర్, వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ రవీందర్రెడ్డి, సీసీఐ అధికారులు అవినాష్, కిరణ్, కాటన్ మిలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసునూరు యుగేంధర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు రేఖ శ్రీధర్ రెడ్డి, వంగాల ప్రతాప్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Konda Mallepally : దళారులను నమ్మి పత్తి రైతులు మోసపోవద్దు : ఎమ్మెల్యే బాలునాయక్