కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. కుంభం అనిల్‌తోపాటు భువనగిరి నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలతోపాటు వందలాది మంది బీఆర్ఎస్లో చేరారు. దాంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దాదాపు జీరో స్థాయికి చేరుకున్నట్లయ్యింది. ఇక భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు భారీ మెజారిటీ మరింత సునాయసం కానున్నది. కుంభం చేరిక ఆలేరు నియోజకవర్గంతోపాటు, జిల్లాలోని పలు మండలాల్లో భారీ ప్రభావం చూపనున్నది. చేరికల కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొనారు.
– యాదాద్రి భువనగిరి, జూలై 24 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి భువనగిరి, జూలై 24 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు మంచి ఆదరణ ఉండడంతో కుంభం అనిల్‌కుమార్ రెడ్డి గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఓ వైపు అభివృద్ధి, మ రో వైపు సంక్షేమ పథకాలతో దేశంలోనే నంబర్‌గా దూసుకెళ్తుండడంతో పార్టీలో చేరేందుకు ఆకర్షితులయ్యారు. అయితే సోమవారం ఉద యం నుంచి సాయంత్రం వరకు భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అట్నుంచి నేరుగా అనుచరణ గణంతో హైదరాబాద్‌కు చేరుకున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. అక్కడే సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
జిల్లాలో కాంగ్రెస్ కుదేలు..
జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాకు పెద్ద దిక్కులా ఉన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ మారడంతో అనాథలా మారిపోయింది. ఏకంగా జిల్లా అధ్యక్షుడే పార్టీ మారడంతో కేడర్ కూడా అయోమయంలో పడిపోయింది. దాంతో పార్టీ శ్రేణులు కూడా అనిల్ కుమార్ రెడ్డి వెంటే నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఒక్క మునుగోడు సీటు కూడా చేజారిపోయింది. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంతో కేడర్ ఇప్పటికే నారాజ్‌లో ఉంది. ఇప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా వెళ్లిపోవడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జీరో స్థాయికి చేరుకోనుంది. పార్టీ జెండా మోసేందుకు కూడా కార్యకర్తలు లేకుండా పోనుంది.
భువనగిరిలో గెలుపు నల్లేరు మీద నడకే..
భువనగిరి నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోనున్నారు. భువనగిరి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇప్పటికే ఆయన గెలుపు సునాయాసం అని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్కు భారీ మేజారిటీ మరింత సులువు కానున్నది. ఇద్దరి కలయికతో నియోజకవర్గంలో బీఆర్ఎస్కు తిరుగులేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆలేరు నియోజకవర్గం పైనా ఎఫెక్ట్..
ఇక కుంభం రాక ఆలేరు నియోజకవర్గంపై ప్రభావం చూపనుంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కావడంతో అక్కడ కూడా ప్రభావితం చూపనున్నారు. ఇప్పటికే ఆలేరులో అంతర్యుద్ధం నడుస్తున్నది. నేతలంతా ఎవరికీ వారు యమునా తీరు అన్న చందంగా వర్గాలుగా విడిపోయారు. ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాత్రలోనూ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇప్పుడు కుంభంతో పాటు ఆలేరు నియోజకవర్గ నుంచి ఆయన అనుచరులు కూడా బీఆర్ఎస్లో చేరనున్నారు. దీంతో ఆలేరులోనూ బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడక కానుంది. అంతేకాకుండా మునుగోడు నియోజకవర్గంలోని రెండు మండలాలు, రామన్నపేట తదితర మండలాలోనూ ఆయనకు అనుచురులు ఉన్నారు.