సూర్యాపేట, పిబ్రవరి 27 : అరాచకాలతో అభివృద్ధి జరగదని, సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకులు రౌడీ రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదని సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు గుండగాని నాగభూషణం హెచ్చరించారు. గురువారం అర్థరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తులు వార్డు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేసీఆర్ భారీ ఫ్లెక్సీని ధ్వంసం చేసి కాలువలో పడేయడంపై తీవ్రంగా మండిపడ్డారు.
పెరుమాళ్ల అన్నపూర్ణ ఆధ్వర్యంలో వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభిమానులు, నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ నాయకుల పనే అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తాము ఏనాడూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడలేదన్నారు. కావాలనే బీఆర్ఎస్ ఫ్లెక్సీని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘వార్డు అభివృద్ధి చేయాలనే ఆలోచన మీకుంటే మేమంతా సహకరిస్తామని, అలా కాకుండా రౌడీ రాజకీయాలు, అరాచకాలు చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ’ని హెచ్చరించారు. కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట వార్డు ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు మచ్చ రా ము, అన్వర్, దుర్గ య్య, ఉపేందర్, న వీన్, శ్రీను, ఉప్పలమ్మ, బండమీది రజిత ఉన్నారు.