కొండాపూర్ : గౌలిదొడ్డిలో సీఅండ్డీ ట్రాన్స్ఫర్ స్టేషన్ను ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయంగా సేకరించి, రవాణా చేసి, రీసైక్లింగ్ చేయనున్నట్లు తెలిపారు. గౌలిదొడ్డి కేంద్రం నార్సింగి, గచ్చిబౌలి, మాదాపూర్, నల్లగండ్ల తదితర ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో వ్యర్థాల సేకరణ, రవాణా మరింత సమర్థవంతంగా సాగుతుందన్నారు. కార్యక్రమంలో సీఎంసీ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు.