మద్దూర్, ఆగస్టు 17 : ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి అన్ని పథకాలను ఎగ్గొడుతూ రేవంత్‌రెడ్డి ఎగవేతల సీఎంగా మారారని కొడంగల్ మాజీ ఎమెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిలుపుదలను నిరసిస్తూ మద్దూర్ మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన ధర్నా ఆయన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో కొడంగల్‌లో ప్రజలే నీ ఆనవాళ్లు లేకుండా చేస్తారని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రజా పాలన అంటూనే ప్రజలను దగా చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నా రని, ఇలాంటి పాలన చేతకాని సీఎం ప్రపంచంలో ఎక్కడ ఉండడని ఎద్దేవా చేశారు.
ఎన్నికలకు ముందు మద్దూర్ పట్టణంలో ఎన్నికల సమయంలో మద్దూర్ పట్టణానికి ఆరు లేన్ల రహదారిని తెస్తానని చెప్పి ఇ ప్పుడు ఆ మాట ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేసిన ఘనత నీదేనని అన్నారు. మద్దూర్‌లో ఇచ్చిన మాటలు చాలక నీమాటలు ప్రజలు నమ్మరని తెలిసి ప్రియాంకా గాంధీతో కల్యాణలక్ష్మి ఇప్పుడిస్తే లక్షనే, అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే లక్షతోపాటు తులం బంగారం ఇస్తానని మాటలు చెప్పి మోసం చేశావని మండి పడ్డారు. వికారాబాద్ జిల్లా హకీంపేటలో పేద రైతులపై జరుగుతున్న దౌర్జన్యాలపై సీఎంం మౌనంగా ఉండటం వెనక అంతర్యం ఏంటని ప్రశ్నించారు. భూ కబ్జాలపై తమ వద్ద పూర్తి సమాచారం ఉందని ఈ వ్యవ హరంలో ఎవరినీ వదిలేది లేదని, రైతులకు అన్యా యం చేసిన ప్రతి ఒక్కరిని న్యాయస్థానం ఎదుట నిలబెడ తామని హెచ్చరించారు. రైతుల తరఫున పోరాటానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.
అ వసరమైతే రైతుల కోసం మరోసారి జైలుకైనా వెళ్తా కాని వారికి అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరు కోమని హెచ్చరించారు. అతి త్వరలో తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలో గులాబీ గుబాళింపు తప్పదని మళ్లీ రైతులకు మంచి రోజులు వస్తాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభ్వుం తీరు మార్చుకొని పాలించాలని సూచించారు. కార్యక్రమంలో మద్దూర్ మండల అధ్యక్షుడు వంచర్ల గోపా ల్, కొత్తపల్లి మండల అధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దినేశ్, నర్సిములు, గోపాల్, మౌలానా, నాయకులు అంజయ్య, శివకుమార్,నెల్లి రాములు, జగదీశ్వర్, విఠల్, సాయిలు, వెంకటయ్య, రాజారెడ్డి, దాసు, మల్లేశ్, శివారెడ్డితో పాటు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.