పాలకవీడు, డిసెంబర్ 13 : పాలకవీడు మండలం రాఘవపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బచ్చలకురి శ్రీను ఆ పార్టీని వీడి శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ హుజుర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహ రెడ్డి సమక్షంలో శ్రీనుతో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు క్రిష్టిపాటీ అంజిరెడ్డి, సర్పంచ్ అభ్యర్థి మూడు శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షుడు యడవల్లి బాబు, మాజీ ఎంపీటీసీ అమరారపు శ్రీను, మాజీ సర్పంచ్ చింత వెంకటమ్మ, మూడు గోపాల్, కొణతం లచ్చిరెడ్డి, శ్రీరాముల రామయ్య, అమరారపు సైదులు, చిట్యాల రాంరెడ్డి, చౌదరి నరేశ్, పోరెడ్డి సైదిరెడ్డి పాల్గొన్నారు.