ప్రజల నుంచి బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అర్థమవుతున్నందునే ఖమ్మం జిల్లాలో పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగుతున్నారు. వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సాయం చేయడానికి రాని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసేందుకు మూకుమ్మడిగా వస్తున్నారు. ఇలాంటి చర్యలు ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.
-బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు డైవర్షన్ పాలిటిక్స్
పాలన తెలియకనో లేక చేతగాకనో కానీ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో బీఆర్ఎస్పై దాడులకు దిగుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. తుంగతుర్తిలో ఇటీవల శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ శిబిరంపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడగా, మంగళవారం ఖమ్మంలో మాజీ మంత్రుల వాహనాలపై రాళ్లదాడి చేయడం కాంగ్రెస్ గూండాయిజానికి పరాకాష్ట. కాంగ్రెస్ పార్టీ అంటేనే మంచి చేయరు. ఇతరులను చేయనియ్యరనేది మరోసారి రుజువు చేసుకుంది. భారీ వర్షాలకు ఖమ్మంలో వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోతే వారి బాధలను విని సాయం చేసేందుకు ఖమ్మం వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి వాహనాలపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి చేతగాని తనమే తప్ప ఇంకేం లేదు.
-గాదరి కిశోర్‌కుమార్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేసిది పాలన కాదు గూండాగిరి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది పాలన కాదు గూండాగిరి. సిద్దిపేటలో హరీశ్‌రావుపై, సీఎం రేవంత్ సొంతూరులో మీడియాకు చెందిన మహిళా జర్నలిస్టులు, తుంగతుర్తిలో బీఆర్ఎస్ శిబిరంపై కాంగ్రెస్ దాడులు చేయగా నేడు ఖమ్మంలో బాధితులకు సాయం చేసేందుకు వెళ్లిన మాజీ మంత్రుల కార్లపై దాడులు చేశారు. ఇవి సిగ్గు చేటు. మనం ఏదీ చేయలేము. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేము కాబట్టి ప్రజలను డైవర్షన్ చేయాలని రేవంత్‌రెడ్డే తన ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్‌కు శిక్షణ ఇస్తున్నట్లు అనుమాన పడాల్సి వస్తున్నది. ఇలాంటి పాలన ఎక్కువ కాలం చేయలేరు. ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడులకు దిగకముందే ఇచ్చిన హామీలు అమలు చేయాలి. వరద బాధితులకు పరిహారం తక్షణమే చెల్లించాలి.
-చిరుమర్తి లింగయ్య, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రుల కార్లపై దాడి హేయమైన చర్య
వరద బాధితులను పరామర్శించడానికి ఖమ్మం వెళ్లిన బీఆర్ఎస్ మాజీ మంత్రుల కార్లపై కాంగ్రెస్ గూండాలు రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య. వరదల వల్ల నిరాశ్రయులైన బాధితులకు ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుల సలహాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించకుండా కొంతమందిని రెచ్చగొట్టి దాడులు చేయించడం పనికిమాలిన చర్య. ఈ చర్యతో కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఛీకొడుతున్నారు. ఇలాంటి దాడులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరు. ఇలాంటివి పునరావృతమైతే తీవ్రంగా ప్రతిఘటిస్తాం.
– నల్లమోతు భాస్కర్‌రావు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే పిరికిపంద చర్యలు
ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులకు బీఆర్ఎస్ సైనికులు బెదరరు. బీఆర్ఎస్ దాడులు చేయాలనుకుంటే ముఖ్యమంత్రి ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళ్లేవారా.. ప్రతిపక్షాలపై దాడులు చేయడం పిరికిపంద చర్య. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తున్నాం. పాలన చేతగాక సాయం చేసేవారిపై దాడులు పూర్తిగా ఆక్షేపనీయం.
– రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నల్లగొండ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్