తుంగతుర్తి, ఏప్రిల్ 4 : ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దగా పాలన చేస్తుందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి మండల పరిధిలోని గుడితండా గ్రామలో ఎండిన పొలాల్లో కండ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువుతో పొలాలన్ని ఎండిపోయి రైతులు అప్పుల పాలయ్యారని దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం రైతులకు, మహిళలకు మోసపూరిత వాగ్ధానాలు చేశాడన్నారు. ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ 16 నెలల పాలనలో నెరవేర్చని విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇందిరమ్మ పాలన అంటే రైతుల పంట పొలాలు ఎండబెట్టడమేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, దొంగరి శ్రీనివాస్, మట్టిపల్లి వెంకట్, స్థానిక సర్పంచ్ భారతి పుణ్యానాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు రవినాయక్, మహిళలు, రైతులు పాల్గొన్నారు.
BRS : ప్రజా పాలనతో పేరుతో కాంగ్రెస్ దగా పాలన : తాటికొండ సీతయ్య