గట్టుప్పల్, డిసెంబర్ 08 : కాంగ్రెస్ పార్టీ గట్టుప్పల్కు చేసిందేమి లేదని మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే గట్టుప్పల్ నూతన మండలంగా ఏర్పడిందని, మండల కేంద్రం ఏర్పడిన తర్వాత గట్టుప్పల్ అభివృద్ధి జరిగిందన్నారు. సోమవారం బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అవ్వారి శ్రీనివాసులను అత్యధిక మెజార్టితో గెలిపించాల్సిందిగా కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని 12వ వార్డులో సర్పంచ్ అభ్యర్థికి ఉంగరం గుర్తు, 12 వార్డు సభ్యుడి స్టూల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. గట్టుప్పల్ మరింత అభివృద్ధి జరగాలంటే ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు అభ్యర్థి పురుషోత్తం, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.