మోతె, జూలై 2 : బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ దవాఖానలు ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తే ..నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. అక్కడి రోగులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ..తాను ఎమ్మెల్యేగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడటంతోపాటు సకాలంలో రోగులకు వైద్య సేవలు అం దించేందుకు అవసరమైన వసతులను కల్పించానన్నారు.
ఇప్పుడు మంత్రి ఉత్తమ్ ఈ కేంద్రా నికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. దవాఖానలో వైద్యులు సిబ్బంది కొరతతోపాటు అవసరమైన మందులు లేకపోవడంతో రోగులు వేల రూపాయలు వెచ్చించి ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.
పీహెచ్సీ వైద్యాధికారి రెండున్నరేండ్ల క్రితం చివ్వెంల ప్రాంతానికి బదిలీ అయి వేరే వైద్యాధికారి విధులు నిర్వహిస్తున్నప్పటికీ పరిపాలనాపరమైన అనుమతులు, నిర్ణయాలు బదిలీ అయిన వైద్యాధికారే నిర్వహించటంపై బొల్లం విస్మయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా వైద్యా రోగ్య అధికారి, కలెక్టర్ స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సైదులు, వెం కటేశ్వరరావు, లింగారెడ్డి, శంకర్‌నాయక్, భూక్యా గాంధీ, వెంకటేశ్వర్లు, రవి పాల్గొన్నారు.