కోదాడ, ఆగస్టు 22 : రైతులకు యూరియాను అందజేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ అనంతగిరి మండలాధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతగిరి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా కొరత లేదని ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటన్నారు. యూరియా కోసం రైతులు పొద్దస్తమానం ఎరువుల దుకాణాల వద్ద, రైతు ఆగ్రో ఏజెన్సీస్ వద్ద పడుకోవడం అంతా చూస్తున్నదేనన్నారు. రైతులు యూరియా కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితిని ఈ కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ రైతులకు ఇలాంటి పరిస్థితి తలెత్తలేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు, అన్ని వర్గాల ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, ఉపాధ్యక్షుడు ఎండీ అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు పి.వీరయ్య, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్య బోస్, పార్టీ నాయకులు కల్వకుంట్ల బిక్షం, కాకాని వెంకటేశ్వర్లు, దొంగరి నాగేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ ఎస్డీ కమల్, కంటూ శ్రీకాంత్, భూక్య జయరాం, మట్టపల్లి శ్రీను, బెల్లంకొండ ఏడుకొండలు పాల్గొన్నారు.