BRS Party | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్లో భారీగా చేరారు. ఈ రెండు పార్టీల నాయకులకు, కార్యకర్తలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూర్ (ఎస్) మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఆత్మకూర్ (ఎస్) మండలంలోని నెమ్మికల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నూతనంగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.