(Parents Win) నల్గొండ: ఆస్తి పంపకాల్లో తల్లిదండ్రులు తనకు అన్యాయం చేశారని కోపం పెంచుకున్న ఓ కొడుకు.. వారు వృద్ధులని కూడా చూడకుండా ఇంటి నుంచి గెంటేశాడు. కలెక్టరేట్ మెట్లెక్కిన ఆ వృద్ధులు.. తమను అలక్ష్యం చేయడమే కాకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడని పిటిషన్ పెట్టుకున్నారు. దాంతో విచారించిన వృద్ధ తల్లిదండ్రులకే ఇంటిని అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ మేరకు అధికారులు కొడుకును ఇంటి నుంచి ఖాళీ చేయించి వారికి అప్పగించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. వివరాల్లోకెళితే..
మిర్యాలగూడ హౌజింగ్ బోర్డు కాలనీలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి బంటు నర్సయ్య, కమలమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరికి శ్రీనివాస్‌తోపాటు ఇద్దరు కుమార్తెలు. అందరికి చదువులు చెప్పించి పెండ్లిళ్లు చేయడంతో వారు జీవితంలో స్థిరపడిపోయారు. అయితే, హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్.. తన సోదరీమణుల వివాహాల సమయంలో జరిపిన ఆస్తి పంపకాల్లో తనకు తీవ్ర అన్యాయం చేశాడని తల్లిదండ్రులపై కోపం పెంచుకున్నాడు. వారిని పట్టించుకోకపోగా వారు ఉంటున్న ఇంటి నుంచి బయటకు పంపి తాళం వేసుకున్నాడు. దాంతో అదే ఇంటి ముందు గుడారం వేసుకుని నివసిస్తున్నారు.
కుమారుడు తమను పట్టించుకోవడం లేదని తొలుత ఆర్డీవోకు, అనంతరం కలెక్టర్‌కు నర్సయ్య ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ చట్టం ప్రకారం ఆ ఇల్లు తల్లిదండ్రులకే ఇవ్వాలని ఈ ఏడాది మే 26 న ఆదేశాలిచ్చాడు. అయితే, కొడుకు సివిల్ కోర్టులో దావా వేయడంతో కలెక్టర్ ఆదేశాలు అమలు కాలేదు. తీవ్రంగా చలి ఉండటంతో వృద్ధ దంపతులు ఇబ్బందిపడుతున్న దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు శ్రీనివాస్‌ను పిలిపించి పోలీసుల సమక్షంలో ఇంటిని తండ్రి నర్సయ్యకు అప్పగించారు.
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..