మునుగోడు, మే 12 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామానికి చెందిన కోట్ల వసుమతికి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్వారా సీఎం సహాయ నిధి నుండి రూ.30,500/- మంజూరయ్యాయి. ఈ చెక్కును గ్రామ పెద్దల ద్వారా లబ్ధిదారుడికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ మాదగోని రాజేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి అనారోగ్యం గురైన బాధిత కుటుంబాలకు ఎంతో ఉపశయనం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గాదె భిక్షమయ్య, గాదె నరసింహ, శ్రీను, యాదయ్య, మల్లయ్య పాల్గొన్నారు.