చండూరు, మార్చి 24: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సీపీఎం (CPM) చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా లోకల్‌బాడీ ఎన్నికలు నిర్వహించపోవడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో సమస్యలు పరిష్కారంకాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సీపీఎం పోరుబాటలో భాగంగా చండూరు మండల పరిధిలోని నేర్మటలోని పలు సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెర్మట గ్రామపంచాయతీ, బస్టాండ్ ముందు డ్రైనేజీ లేకపోవడంతో మురికి కాల్వలో ఈగలు, దోమలు ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కొంతకాలంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు వార్డుల్లో గతంలో సీసీ రోడ్లు వేసినప్పటికీ మురికి కాల్వల నిర్మాణం, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు సరిగా రాక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్నారు.
గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలైన పుల్లెంల, గొల్లగూడెం, బంగారిగడ్డ, లెంకలపల్లి, శేరి గూడెం, ఈ గ్రామాలకు లింకు రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అధికారులు గ్రామాలలో ఇప్పటికప్పుడు సమాచారం తీసుకోని ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, బల్లెం వెంకన్న,ఈరగట్ల నరసింహ, బొమ్మరగోని యాదయ్య, దాసరి రాములు, నారపాక నరసింహ, శంకర్, గ్రామ ప్రజలు బొమ్మరగోని నాగరాజు,సతీష్,బుర్కల నవీన్, బొడిగె నగేష్, బుర్కల సైదులు, రావుల రవి, పగిళ్ల స్వామి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.