తుంగతుర్తి, జనవరి 20 : ప్రతిపక్ష పార్టీ దిమ్మెలను కూల్చాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చాలని చెప్పడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి విద్వేషపూరిత ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, భవిష్యత్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, గుండగాని దుర్గయ్య, గోపగాని రమేశ్, గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న, నల్లబెల్లి వెంకన్న, కిరణ్ పాల్గొన్నారు.