మునుగోడు, మార్చి 14 : అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పిలుపుమేరకు బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్యే ప్రశ్నిస్తుండగా ఒక చిన్న పదాన్ని పట్టుకుని దేశ చరిత్రలోనే ఇలాంటి సీఎం లేడు అన్నట్టుగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మందుల సత్యం, పగిళ్ల సతీశ్, ఈద శరత్ బాబు, మారగోని అంజయ్య, మేకల శ్రీనివాస్ రెడ్డి, మాదనబోయిన పరమేష్ యాదవ్, బోయ లింగస్వామి, యడవల్లి సురేష్, దోటి కరుణాకర్, అయితగోని విజయ్, ఐతరాజు పర్వతాలు, సింగం సైదులు, బండారు శ్రీనివాస్, జంగిలి సాంబయ్య, దుబ్బ రాజశేఖర్, జీడిమెట్ల జలంధర్, పందుల రాజేష్, దొమ్మటి శ్రీను, సురిగి రవి, నందిపాటి వెంకన్న, దండు మహేష్, యాదగిరి, వెంకన్న, ఐయితరాజు వెంకన్న, ముఖ్య నాయకులు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.