నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నకిరేకల్ మున్సిపాలిటీలో దాదాపు 3000 మంది పెన్షన్‌దారులు ఉన్నారని.. కానీ ప్రస్తుతం ఒకే కేంద్రంలో పెన్షన్ పంపిణీ చేయడం వల్ల వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎండాకాలంలో గంటల తరబడి నిలబడి పెన్షన్లు తీసుకోవడం వారికి మరింత కష్టంగా మారిందని పేర్కొన్నారు.
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం నాలుగు కేంద్రాల్లో పెన్షన్ పంపిణీ చేపట్టాలని చిరుమర్తి లింగయ్య సూచించారు. బాబాసాహెబ్ గూడెం, మూసీ రోడ్, చీమలగడ్డతో పాటు అదనంగా మరో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. అలాగే టెంట్లు, తాగునీటి సదుపాయం, కూర్చునే ఏర్పాట్లు తప్పనిసరిగా కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి సదుపాయాలు కల్పిస్తూ సక్రమంగా పెన్షన్లు పంపిణీ చేశామని గుర్తుచేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టి, అందరికీ సులభంగా పెన్షన్ అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు..
వెంటనే చర్యలు తీసుకొని, అందరికీ సులభంగా మరియు గౌరవంగా పెన్షన్ పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు.